హైదరాబాద్: 28°C
భక్తి

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 3 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 65,223 మంది భక్తులు దర్శించుకోగా, 27,112 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.