AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 72,019 మంది భక్తులు దర్శించుకోగా, 25,431 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.3.50 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమల సమాచారం

