NDL: కోవెలకుంట్లలో రోడ్లపై ఆవులు, పందులను యజమానులు వదిలేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని సీఐ హనుమంతు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలు, వ్యాధుల వ్యాప్తి దృష్ట్యా పందులను ఈ నెల 23లోపు పట్టణం వెలుపల తరలించాలని సూచించారు. ఆవులను ఇళ్ల వద్ద కట్టేయాలని, నిబంధనలు పాటించకపోతే గోశాలకు తరలిస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కోవెలకుంట్ల సీఐ హెచ్చరిక!


