ప్రతిరోజూ భుజంగాసనం (కోబ్రా పోజ్) వేయడం వల్ల వెన్నుముక బలపడుతుంది. వెన్నుముకను సాగదీయడం ద్వారా కండరాల బిగుతును తగ్గించి, నడుము నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. పొట్ట భాగంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది. అజీర్తి, మలబద్ధకం తొలగిపోయి, పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఛాతీ భాగం తెరుచుకుని ఎక్కువ ఆక్సిజన్ అందడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఆరోగ్యం
భుజంగాసనం వల్ల కలిగే ఉపయోగాలు


