హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

గుండెపోటు సంకేతాలను గుర్తించండి ఇలా

ఛాతీ నొప్పి మాత్రమే గుండెపోటు లక్షణం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. భుజాలు, చేతులు, మెడ, దవడ లేదా వీపులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలతిరగడం, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భుజం లేదా ఛాతీ నొప్పిని గ్యాస్‌గా భావించి నిర్లక్ష్యం చేయకుండా, అనుమానం ఉంటే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని సూచిస్తున్నారు.