హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతి

HNK: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం రాత్రి బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన తాడూరి జశ్వంత్ (12) భోజనం అనంతరం రాత్రి 10 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.