BHPL: కాటారం మండలం చిద్నేపల్లి వీవోఏ స్వరూప స్త్రీనిధి రుణాల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని వరలక్ష్మి మహిళా సంఘం సభ్యులు సోమవారం ఆరోపించారు. సంఘంలోని నలుగురు సభ్యులకు మంజూరైన రూ.4 లక్షల్లో రూ.2 లక్షలు మాత్రమే ఇచ్చి, మిగతా రూ.2 లక్షలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
తెలంగాణ
స్త్రీనిధి రుణాల్లో అక్రమాల ఆరోపణ


