హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీటీడీ మండపం అభివృద్ధికి వినతి

KNR: చొప్పదండిలోని టీటీడీ కల్యాణ మండపం అభివృద్ధితో పాటు ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 18 కుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం మండపం చిన్నగా ఉండటంతో శుభకార్యాలు నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి అనుమతిస్తే నిర్వహణ బాధ్యతలు చేపడతామని పేర్కొన్నారు.