హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫేక్ డిప్యూటీ జైలర్‌పై కేసు నమోదు

MDK: తాను కంది డిప్యూటీ జైలరునంటూ ఫోన్ చేసి బెదిరించిన కాట్రోత్ సురేష్‌పై కేసు నమోదు చేసినట్లు SI మధుకర్ రెడ్డి తెలిపారు. సికింద్లాపూర్‌కు చెందిన నర్సింలుకు ఫోన్ చేసిన సురేష్‌ నీ భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసిందని, జైలుకు పంపుతానని బెదిరించాడు. నిజం తెలుసుకున్న బాధితుడు శివ్వంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.