హైదరాబాద్: 28°C
తెలంగాణ

భక్తులను ఆకట్టుకుంటున్న రాధాకృష్ణుల వినాయక విగ్రహం

ADB: కేంద్రంలోని భుక్తాపూర్ శ్రీ బాలగోపాల అక్షిత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గజనాధుడిని రాధా-కృష్ణుల రూపంలో అత్యంత మనోహరంగా అలంకరించి ప్రతిష్టించారు. ఇద్దరు కూడా చూడ ముచ్చటగా ఉన్నారు. ఈ నయన మనోహర రూపాలను తిలకించేందుకు కాలనీవాసులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచారు.