హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లలో గ్యాస్ సిలిండర్ల పట్టివేత

MDK: చేగుంట మండలంలో దాబా, హోటళ్లలో అక్రమంగా వినియోగిస్తున్న గృహావసరాల గ్యాస్ సిలిండర్లను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ నర్సింహులు ఆధ్వర్యంలో రెడ్డిపల్లి శివారులోని అక్షిత దాబాలో 4, కర్నాల్‌పల్లి బీటెక్ చాయ్‌వాల  హోటల్‌లో 3 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వినియోగిస్తున్నారన్న సమాచారంతో దాడులు చేసి కేసు నమోదు చేశారు.