హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వెంకటేశ్వర స్వామివారి కల్యాణోత్సవం

SRD: రామచంద్రాపురం పరిధిలోని కొల్లూరులో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణా నక్షత్రం సందర్భంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు.