NLG: నాగర్జునసాగర్ ఎడమకాలువకు ఎన్నెస్పీ అధికారులు నీటి విడుదల నిలిపివేశారు. ఈ కాలువ పరిధిలోని పెద్దదేవుల పల్లి, పాలేరు జలాశయాల్లో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 26 నుంచి నీటిని విడుదల చేసింది. ఇటీవల పడుతున్న వర్షాల కారణంగా నీటి అవసరం అంతగా లేనందున నీటి పారుదలశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిన్న రాత్రి నీటి విడుదల నిలిపివేనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
సాగర్ ఎడమ కాలువకు నీరు నిలిపివేత!


