BHPL: చిట్యాల మండలం జూకల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 46ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. 1979–80లో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా పాఠశాలకు చేరుకుని తమ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. సర్పంచి సంధ్యారాణి, హెచ్‌ఎం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా అపూర్వ సమ్మేళనం...


