హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్

KMM: కామేపల్లి మండలంలోని కామేపల్లి, పాతలింగాల రైతు వేదికల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి శాస్త్రవేత్తలతో రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏవో బి.తారా దేవి తెలిపారు. ఎల్ నినో ప్రభావం, పత్తిలో మొక్కల సంరక్షణ చర్యలు, పురుగు మందుల అవశేషాలు, ఆమోదిత వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.