JN: రఘునాథపల్లి మండలం వెల్ది ఆదర్శ జూనియర్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు శ్రుతి, మంద అజయ్ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు.
తెలంగాణ
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక


