BHPL: బస్వరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలను టీఆర్‌పీ ఘనపురం మండల అధ్యక్షుడు గండు కర్ణాకర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి, చదువు, పాఠశాల వసతులు, భోజనం నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా వసతులు కల్పించాలన్నారు.
తెలంగాణ
'ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి'


