హైదరాబాద్: 28°C
తెలంగాణ

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్టు

WGL: గీసుకొండ మండలం గరీబ్‌నగర్‌లో తమ్ముడు ప్రసాద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన అన్న ఎలుబాక ప్రవీణ్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. తల్లి వద్ద డబ్బులు తీసుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి ప్రవీణ్‌ తమ్ముడి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి హత్య చేసినట్లు మామునూరు ఏసీపీ వెంకటేశ్‌ తెలిపారు.