హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

PDPL: వినాయక నిమజ్జనానికి ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు సోమవారం అధికారులను ఆదేశించారు. పెద్దపల్లిలో ఎల్లమ్మ గుండమ్మ చెరువు కట్ట వద్ద నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, నిమజ్జన వేడుకలను శాంతియుతంగా నిర్వహించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.