హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుర్నవల్లి సొసైటీలో 445 బ్యాగుల యూరియా

KMM: తల్లాడ మండలం కుర్నవల్లి సొసైటీలో మంగళవారం ఉదయం 8 గంటలకు 445 బ్యాగుల యూరియా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్ తెలిపారు.బుక్ చేసుకున్న రైతులకు రేపు ఉదయం 8:30 గంటల నుంచి యూరియా అందజేస్తామని పేర్కొన్నారు. బుకింగ్ చేసుకున్న రైతులు QR code, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని అధికారులు సూచించారు.