హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విధ్యుత్ సరఫరాలో అంతరాయం

BHNG: భువనగిరి పట్టణంలో వినాయక శోభాయాత్ర జరిగే మార్గంలో లో లెవల్‌లో ఉన్న విద్యుత్ లైన్లను హై రైజింగ్ చేసే పనులు చేపట్టనున్నట్లు పట్టణ ఏఈ సాయికృష్ణ తెలిపారు. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కిసాన్నగర్, గాంధీనగర్, మీనానగర్, తాతానగర్, హౌసింగ్ బోర్డు కాలనీల ప్రజలు సహకరించాలని కోరారు.