హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు: కలెక్టర్

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సంబంధిత అధికారులతో కలిసి రహదారి భద్రత సమావేశానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో స్పీడ్ బ్రేకర్లు, ఇతర రోడ్డు భద్రత సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు భద్రత నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.