హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు మంగళవారం కుప్పం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ రూ. 24 కోట్లు మంజూరు చేసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పాల్గొంటారు.