హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెర్రెల పీజీఆర్‌ఎస్‌కు 44 ఫిర్యాదులు

ASR: జీకేవీధి మండలం జెర్రెల స్వర్ణ గ్రామ సచివాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి మొత్తం 44 ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో బీహెచ్‌వీ రమణబాబు తెలిపారు. భూ సమస్యలు, తాగునీటి, రహదారి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల భవనాల నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టాలని అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులు సంబంధిత అధికారులకు చేరవేశామని తెలిపారు.