హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎమ్మెల్యే

NGKL: అమ్రాబాద్ మండలంలోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.