హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ములుగు జిల్లా వ్యాప్తంగా గణపతి విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత్ అధికారులను ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాలను సందర్శించి నీటి ప్రవాహం, లోతును పరిశీలించాలని, క్రేన్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని సూచించారు. జలాశయాల్లో వ్యర్ధాలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.