MLG: సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని SFI రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ డిమాండ్ చేశారు. నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల యూనివర్సిటీ కార్యకలాపాలపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రి సీతక్క స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని కోరారు.
తెలంగాణ
ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేయాలని డిమాండ్


