హైదరాబాద్: 28°C
తెలంగాణ

1,200 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ

SRPT: గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 1,200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు, ఏఆర్, బాంబ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ సిబ్బంది విధుల్లో ఉంటారని చెప్పారు.