హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొంగులేటి అనుచరుడి కారుపై దాడి

KMM: తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా గ్రామ శివారులో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామసహయం నరేష్ రెడ్డి కార్ల పైన సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మండలంలోని వివిధ గ్రామాలలో గణేశ్ మండపాలు వద్ద పూజల్లో పాల్గొని వస్తుండగా దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.