హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు విస్తరణతో ఇళ్లు కోల్పోతున్నాం.. బాధితుల ఆవేదన

NRPT: మద్దూరు మున్సిపాలిటీ పాత బస్టాండ్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి చింతల్‌దిండి రోడ్డు వరకు చేపట్టిన విస్తరణ పనులతో ఇళ్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా డీఈఈ అంజిరెడ్డి బాధితులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నష్టపోతున్న కుటుంబాలకు న్యాయం చేయాలని అధికారులను కోరారు.