హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 4న రెడ్ క్రాస్ ఎన్నికలు

​SRD: సంగారెడ్డి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్లు జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ ప్రకటించారు. ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ, 25న పరిశీలన, 26న ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుందన్నారు. అక్టోబర్ 4వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన వారు కలెక్టరేట్‌లోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు సమర్పించారు.