హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి: కలెక్టర్

NRPT: ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రియాంక సమావేశం నిర్వహించారు. ఫారం-6, 7, 8 వినియోగం, క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన, పరిష్కారం మరియు తుది జాబితా ప్రచురణ షెడ్యూల్‌పై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు సమర్పించాలని కోరారు.