SRD: సంగారెడ్డి జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జడ్పీ సీఈవో జానకి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బకాయిలు రాక ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి'


