SDPT: ఈ నెల 24, 25 తేదీలలో చేర్యాల పట్టణ వేదికగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సిద్దిపేట జిల్లా 5వ మహాసభలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ వివరాలు వెల్లడించారు. విద్యార్థుల సమస్యలపై చర్చించే ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
'విద్యార్థి మహాసభలను జయప్రదం చేయండి'


