JGL: కోరుట్ల పట్టణానికి చెందిన కల్లెడ రోహిత్ జాతీయస్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ శ్రీ లక్ష్మీనారాయణ రోహిత్‌ను అభినందించారు. కఠోర సాధనతో జాతీయస్థాయిలో పతకం సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ పవర్‌లిఫ్టింగ్‌లో రోహిత్‌కు రజత పతకం


