హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్సై

WNP: వినాయక నిమజ్జనాన్ని ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పానగల్ ఎస్సై కురుమయ్య సూచించారు. ఊరేగింపులో చిన్నారుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, విద్యుత్ తీగలు, చెరువు ఘాట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. డీజేలు, మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిమజ్జనం వేళ అల్లరిమూకలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.