WGL: రాయపర్తిలోని కేసీఆర్ కాలనీ (డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం) లో పది రోజులుగా మిషన్ భగీరథ జలాలు సరఫరా కావడం లేదని కాలనీవాసులు తెలిపారు. తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ప్రతి నెలా నీటి సమస్య తలెత్తుతున్నా గ్రామపంచాయతీ పాలకవర్గం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.
తెలంగాణ
కేసీఆర్ కాలనీలో తాగునీరు కష్టాలు..!


