హైదరాబాద్: 28°C
తెలంగాణ

108 రకాల నైవేద్యాలతో గణపతికి ప్రత్యేక పూజలు

SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుడికి 108 రకాల పిండివంటలు, ప్రసాదాలతో నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పూజా కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.