హైదరాబాద్: 28°C
తెలంగాణ

118 రకాల నైవేద్యాలతో గణపయ్యకు ప్రత్యేక పూజలు

HYD: బన్సీలాల్‌పేట్ డివిజన్ దేవీనగర్‌లో గణనాథుడికి భక్తులు 118 రకాల వంటకాలతో మహా నైవేద్యం సమర్పించారు. మండపంలో కొలువై ఉన్న గణనాథుడికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.