NZB: మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని సీపీ సాయి చైతన్య అన్నారు. తిర్మన్ పల్లిలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని దర్శించి పూజలు చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించవచ్చన్నారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణకు కృషి అభినందనీయం: సీపీ


