WNP: రామ్‌నగర్ కాలనీలో పందుల సంచారం అధికమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన లేదని చెబుతున్నారు. పందుల కారణంగా చిన్నారులను బయటకు పంపాలంటేనే భయంగా ఉందంటున్నారు. కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, పందుల బెడదను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
నగరంలో పందుల స్వైర విహారం!


