హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా షేర్లలో LIC దూకుడు

టాటా గ్రూప్ షేర్లలో పెట్టుబడులను LIC భారీగా పెంచింది. టాటా గ్రూప్‌లోని 14 లిస్టెడ్ కంపెనీల్లో 10 కంపెనీల్లో 2022 నుంచి వాటాలను పెంచుకుంది. దీంతో టాటా షేర్లలో LIC పెట్టుబడుల విలువ రూ.లక్ష కోట్లు దాటింది. TCSలో 5.52% వాటా విలువ రూ.41,960 కోట్లు, టాటా స్టీల్‌లో 6.3% వాటా రూ.14 వేల కోట్లుగా ఉంది. మొత్తంగా LIC ఈక్విటీ పోర్ట్‌ఫోలియో విలువ రూ.16 లక్షల కోట్లుగా ఉంది.