పార్వతీపురం: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. అంగన్వాడీలకు పెన్షన్ పథకాలు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు పాల్గొన్నారు.
వార్తలు
'అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి'


