హైదరాబాద్: 28°C
వార్తలు

ఆర్వీ నగర్ కాఫీ కేంద్రంలో స్వర్ణోత్సవ సంబరాలకు ఏర్పాట్లు

ASR: జీకేవీధి (మం) ఆర్వీ నగర్ ప్రాంతీయ కాఫీ పరిశోధనా కేంద్రం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని కాఫీ బోర్డు సీఈవో కూర్మరాజు తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ నిశాంతి, జేసీ శ్రీపూజ, పీవో ఆదిత్యవర్మతో సోమవారం వీసీ ద్వారా సమీక్షించారు. కాఫీ సాగు విస్తరణపై దృష్టి సారించాలన్నారు.