హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి'

ADB: సుంకిడి ప్రభుత్వ పాఠశాలలో నిర్మాణంలో ఉన్న గదుల పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ZPTC గోక గణేష్ రెడ్డి కోరారు. పాఠశాల గదులు శిథిలావస్థకు చేరడంతో సమస్యను గతంలో కలెక్టర్ రాజర్షిషా దృష్టికి తీసుకెళ్లగా రూ. 15 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.