KMM: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకుడు కృష్ణార్జునరావు డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ డేలో ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, సర్దుబాటు పేరుతో బదిలీలు ఆపాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి: CPM


