హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రాఫిక్ నిబంధనలు పాటించండి'

కడప జిల్లాలో సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 78 కేసులు నమోదు చేసి రూ.16,600 జరిమానా విధించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్ రూట్, మొబైల్ వినియోగం, అతివేగం దూరంగా ఉండాలని తెలిపారు.