హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి పోటీలకు

NGKL: తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే జూనియర్ గర్ల్స్ నేషనల్స్ టోర్నమెంట్‌కు కల్వకుర్తి మండలం మార్చాల ZPHS 10వ తరగతి విద్యార్థిని అక్షర ఎంపికైంది. ఈ నెల 25న ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో ఆమె తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. అక్షర ఎంపికపై పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.