హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ అరెస్టులను ఖండించిన BRS

GDWL: కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్నది పోలీసు బలం అని BRS పార్టీ గద్వాల్ జిల్లా నాయకులు గంజిపేట రాజు అన్నారు. సోమవారం జూరాల ప్రాజెక్టు వద్ద రైతులకు సాగునీరు అందించాలని BRS పార్టీ ఆధ్వర్యంలో నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గద్వాల టౌన్ పోలీసులు గంజిపేట రాజుని ఆయన ఇంటి వద్ద ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.