NRPT: మరికల్ మండలం పెద్ద చింతకుంటలో శ్రీ ఈశ్వర ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం రాత్రి 'ఇరుముడి' చిత్రాన్ని ప్రదర్శించారు. తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ సినిమాను గ్రామాల్లో ప్రజలు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. గతంలో 'బలగం' చిత్రం తర్వాత అదే స్థాయిలో గ్రామాల్లో ఈ సినిమాకు ఆదరణ లభిస్తోందని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
పెద్ద చింతకుంటలో ఇరుముడి ప్రదర్శన


